త్వరలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

  • దరఖాస్తులను వెనక్కి తీసుకోవడానికి త్వరలో ఆప్షన్
  • మిగిలిన దరఖాస్తులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్ధులందర్నీ పాస్ చేస్తున్నందున జవాబుపత్రాల పునఃపరిశీలన, పునఃలె క్కింపు దరఖాస్తులను విరమించుకోవడానికి అవసరమైన సౌకర్యాన్ని ఇంటర్మీడియట్ బోర్డు త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

విద్యార్థులందరిని కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసిన నేపథ్యంలో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వద్దు అనుకునే విద్యార్ధులు చెల్లించిన రుసుములను వెనక్కి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

ఫెయిల్ అయిన వారితోపాటు… ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని భావించిన 39,039 దరఖాస్తులు పునఃపరిశీలనకు, మరో 4200 పునఃలెక్కింపు కోసం దరఖాస్తు చేసుకున్నారు

ఈ దరఖాస్తులలో కనీసం సగం మంది ఫెయిల్ అయిన వారున్నట్లు సమాచారం. వారిలో చాలా మంది దరఖాస్తులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. తదనంతరం ఆన్లైన్ ద్వారా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసే అవకాశం ఉంది.