తెలంగాణ ప్రభుత్వం 2022 క్యాలెండర్ ఇయర్ కు సంబంధించి సాధారణ సెలవులు మరియు ఐచ్ఛిక సెలవుల తేదీలను ప్రకటించింది.
28 రోజులు సాధారణ సెలవులుగా 23 రోజులు ఐచ్ఛిక సెలవులుగా నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు గరిష్టంగా ఐదు ఐచ్ఛిక సెలవులను ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించింది.
రెండవ శనివారం మరియు ప్రతి ఆదివారం ను సాధారణ సెలవులుగా పరిగణించింది. అయితే ఫిబ్రవరి రెండవ శనివారము పని దినముగా నిర్ణయించింది జనవరి ఒకటో తారీఖున ఇచ్చిన సెలవుకు ఈ రెండవ శనివారము పని దినంగా ఉండనుంది.

