జాతీయ స్థాయి క్రీడలకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన బీ.ఏ. మొదటి సంవత్సరం చదువుతున్న ఈ. తేజ, బీ.ఏ. సెకండ్ ఇయర్ చదువుతున్న కెతావత్. అర్జున్ లు అల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అథ్లెటిక్ చాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయినట్లు ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపారు.

ఈ. తేజ డిసెంబర్ 28 న జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కళాశాల టోర్నమెంట్ సెలెక్షన్స్ లో లాంగ్ జంప్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. కె.అర్జున్ 10 కీ.మీ. ల పరుగులో జాతీయస్థాయిలో సెలెక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధాకర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ డా.దినకర్ మరియు స్పోర్ట్స్ విభాగపు ఇంచార్జి వినోద్ కుమార్ లు అభినందనలు తెలిపారు.