రాజన్న సిరిసిల్ల జిల్లా బదిలీల సాధన సమితి కార్యవర్గం ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల సాధన సమితి, గురువారం నాడు రాష్ట్ర బదిలీ సాధన సమితి కన్వీనర్ నరసింహారెడ్డి పర్యవేక్షణలో రాష్ట్ర కార్యదర్శి మాతంగీ పాపారావు ఆధ్వర్యంలో గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

రాజన్న జిల్లా సిరిసిల్ల అధ్యక్షులుగా నాగమల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిన్నె రాజు, కోశాధికారిగా దానబోయిన మహేందర్, ఉపాధ్యక్షులుగా శ్రీరాములు, మహిళ కార్యదర్శిగా కడారి కవిత, జిల్లా కార్యవర్గ సభ్యులుగా చంద్రమౌళి, నాగమణిలను ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు బదిలీలు జరగక తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కావున వెంటనే బదిలీలకు అవకాశం కల్పించి నూతన జోన్లు, మల్టీ జోన్ ల తో సంబంధం లేకుండా ఎవరి సొంత జిల్లాకు వారిని బదిలీ చేయాలని కోరారు. కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల సాధన సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. మధుసూదన్ రెడ్డికి, రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు