“ఐక్యవేదిక” దిశగా జీవో 16 అమలు సాధన సమితి


గత 20 సంవత్సరాలుగా వెట్టిచాకిరికి మరియు దోపిడీకి గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేక, ఆరోగ్య భద్రత లేక, సామాజిక భద్రత లేక, “దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు” గా బ్రతుకుతున్న అన్ని శాఖలలోని కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ జీవో నెంబర్ 16 ద్వారా తమ జీవితాలలో వెలుగులు వస్తాయని గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ తరుణంలో కోర్టు తీర్పు సానుకూలంగా వచ్చినప్పటికీ, ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం పై ఎంతో నిరాశ గురవుతున్న కాంట్రాక్టు ఉద్యోగుల తరపున ఎర్పడిన జీవో 16 అమలు సాదన సమితి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మరియు ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది.

ఈ నేపథ్యంలో జీవో నెంబర్ 16 అమలు చేయాలని క్రమబద్దీకరణ అమలు సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమితి ఆధ్వర్యంలో ఇప్పటికే కొంత మంది ప్రభుత్వ పెద్దలను కలవడం జరిగింది. త్వరలో ఇతర పెద్దలను కూడా కలవబోతున్నాం,ఈ నేపథ్యంలో మన క్రమబద్దీకరణ అమలు సాధన సమితి లో చేరడానికి ప్రభుత్వ కళాశాలల ఎస్సీ & ఎస్టీ అసోసియేషన్ నాయకులు కె. నగేష్ అంగీకరించారు. అదేవిధంగా ఇతర కాంట్రాక్టు ఉద్యోగ /అధ్యాపక సంఘాలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ పిలుపునిచ్చారు.