జేఎల్స్ విభజన సమస్యలు విద్యా శాఖ మంత్రి దృష్టికి – TIGLA

జీవో 317 ప్రకారం జరుగుతున్న ఇంటర్మీడియట్ మల్టీ జోనల్ ఉద్యోగుల విభజనపై ఉద్యోగులకు జరుగుతున్న నష్టం, ఇబ్బంది గురించి TIGLA ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా శాఖమంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిని వారి కార్యాలయంలో కలసి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో 85% పైగా ఖాళీలు ఉన్న కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కోరడం జరిగింది.

దీనిపై స్పందిస్తూ ఈ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు సాధ్యమైనంత వరకు ఇబ్బంది కలుగకుండా చూస్తామని హమీ ఇచ్చినట్లు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు ఒక ప్రకటనలో తెలిపారు.