విద్యాశాఖ మంత్రిని కలిసిన జీవో 16 అమలు సాదన సమితి బృందం

కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ ల క్రమబద్ధీకరణ కొరకు జీవో నంబర్ -16 అమలు సాధన సమితి తరపున ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డిని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా క్రమబద్ధీకరణ విషయంపై కోర్టు తీర్పు మరియు ఇతర విషయాలును మంత్రి దృష్ష్టికి తీసుకెళ్లడం జరిగిందని… వారు సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగిందని కన్వీనర్ డా. కోప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మన గౌరవ సలహాదారులు డాక్టర్ అందే సత్యం, మాచర్ల రామకృష్ణ గౌడ్ మరియు TIGLA రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్, పాలిటెక్నిక్, మెడికల్, కాంట్రాక్ట్ సంఘాల నాయకులు, రమణారెడ్డి, మనోహర్, నవీన్ ,మోహన్ రెడ్డి , వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.