జీవో 16 అమలుకై ప్రయత్నాలు : డా. కొప్పిశెట్టి సురేష్

కాంట్రాక్టు ఉద్యోగుల/క్రమబద్ధీకరణ కొరకు… క్రమబద్ధీకరణ జీవో నంబర్ 16 అమలు చేయడంలో సహకరించ వలసిందిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ బోయినపల్లి వినోద్ కుమార్ ని కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ జీవో నంబర్ -16 అమలు విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని హమీ ఇచ్చారని సాదన సమితి కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ, జూనియర్, మెడికల్ మరియు పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ అధ్యాపకులు, ఉద్యోగులు పాల్గోనడం జరిగింది.