TIGOA ఉమ్మడి వరంగల్ నూతన కార్యవర్గం ఏర్పాటు


తెలంగాణ ఇంటర్మీడియట్ గెజిటెడ్ అధికారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గ సమావేశం ఇంటర్ విద్య హనుమకొండ కార్యాలయంలో జరిగింది.ఇంటర్ విద్య ఏదుర్కొంటున్న సవాళ్ళు, పరిష్కారం, వికాసం ఇతివృత్తంగా సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి ఈ క్రింది తీర్మానాలను ఆమోదించడము జరిగింది.

  1. ప్రతికూల పరిస్థితులలో జరిగిన ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణత పడిపోయింది.టిజిఓ తో పలు సోదర సంఘాల వినతి మేరకు అందరిని పాస్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

2. మన ఆందోళనను కేసిర్ గారికి తెలియచేసి సానుకూల నిర్ణయం వెలువడదానికి కృషి చేసిన టిజిఓ వ్యవస్థాపకుడు ,గౌరవ మంత్రివర్యులు శ్రీ విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు.

3. కార్పొరేట్ సంస్థలకు దళారులుగా వ్యవహరిస్తూ మాఫియా తత్వంతో ఉద్దేశ్యపూర్వకంగా పరీక్షల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్న బోర్డ్ అధికారులను,వారి తొత్తు సంఘ నేతల పై తగు చర్యలను తీసుకోవాలని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాని కోరడం జరిగింది .

4. యుద్ధ ప్రాతిపదికగా అతిధి అధ్యాపకులను పెనుబల్లి,ఆలేరు, శాయంపేట వంటి పలు కళాశాలల్లో కేటాయించాలని కోరింది.

5. ఇంటర్ ఉద్యోగుల అప్షన్స్ కేటాయింపు ప్రక్రియ ను పారదర్శకంగా నిర్వహిస్తున్న గౌరవ కమిషనర్, ఆర్జేడీ,డిడి గార్లకు కృతజ్ఞతలు.

6. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం,ఉచిత బస్ పాస్ లు,బాలికలకు హెల్త్ కిట్స్ ఇవ్వాలి.

7. గ్రంథ పాలకుల న్యాయమైన డిమాండ్ ఐన 302 జి ఓ ను వెంటనే సవరించాలి.

8. జి ఓ 16 వెలుగులో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ వెంటనే చేయాలి.

ఉమ్మడి వరంగల్ టి జి ఓ ఇంటర్ విద్య కార్యవర్గంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడం జరిగింది టిఐజిఓఏ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధీర్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

అధ్యక్షులు-సింగారపు శ్రీధర్
సహా అధ్యక్షులు-.పి.కవిత


  • అధ్యక్షులు-సింగారపు శ్రీధర్ (ప్రిన్సిపాల్ జిజెసి శాయంపేట),
  • సహా అధ్యక్షులు-.పి.కవిత (ప్రిన్సిపాల్ జిజెసి గర్ల్స్ హన్మకొండ), డి.కవిత (వృక్షశాస్త్ర అధ్యాపకులు జిజెసి కమలాపూర్),
  • ప్రధాన కార్యదర్శి-బి.బాలునాయక్ (లైబ్రేరియన్ జిజెసి ఆత్మకూర్),
  • మహిళా ఉపాధ్యక్షులు యమ్. భగవద్గీత (ప్రిన్సిపాల్
    జిజెసి ఏటూరునాగారం),
  • ఉపాధ్యక్షులుగా .కె.శ్రీధర్ (వృక్ష శాస్త్ర అధ్యాపకులు జిజెసి సంగెము), యమ్. నరేందర్ (ప్రిన్సిపాల్ జిజెసి కాటారం), సారంగపాణి, (లైబ్రరీయన్ జిజెసి ఖానాపూర్), స్వాతి (ఆంగ్ల అధ్యాపకులు జిజెసి భూపాలపల్లి) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ప్రధాన కార్యదర్శి-బి.బాలునాయక్