రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేయించుకోవడం ఫీజు చెల్లించిన విద్యార్థుల ఇష్టం

  • ఇంటర్మీడియట్ బోర్డుకు అభిప్రాయం చెప్పాలి
  • వద్దనుకుంటే చెల్లించిన ఫీజు వెనక్కి

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష పేపర్ల రీవాల్యుయేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వాటిని వద్దనుకుంటే చెల్లించిన సొమ్మును తిరిగిస్తామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు.

ఒకవేళ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కావాలనుకుంటే చేయించుకోవచ్చని… వారికి డబ్బులు తిరిగి చెల్లించబోమన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయం ఇంటర్‌ బోర్డుకు తెలియజేయవచ్చన్నారు.