కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లకు ఆప్షన్లు ఇవ్వాలి : బదిలీ సాదన సమితి

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు నూతన జిల్లా, జోన్, మల్టీ జోన్ ల ప్రకారము విభజనను చేసి వారి సొంత జిల్లాలకు బదిలీ చేయవలసిందిగా బదిలీ సాధన సమితి తరపున నాయకులు సి. నరసింహ రెడ్డి, నూనె శ్రీనివాస్, మోతిలాల్ నాయక్, రాముడు, శ్రీనాద్ లు డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్నారని, కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు బదిలీలు చేయకపోవడంతో పదమూడు సంవత్సరాలుగా ఒకే కళాశాలలో కుటుంబాలకు సుదూరంగా పని చేస్తున్నారని‌ పేర్కొన్నారు.

ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్

నూతన జోనల్ ప్రకారం చాలా మంది కాంట్రాక్టు లెక్చరర్లు వారి స్థానికతను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని. అంతేకాకుండా కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లలో చాలామంది అనారోగ్యంతో మరియు స్పౌజ్ కేసుల కారణంగా భార్య ఒకచోట భర్త ఒకచోట పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కావున ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల ఆప్షన్ ప్రక్రియ పూర్తికాగానే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు కూడా రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ల మాదిరిగా విభజన పూర్తి చేసి వారిని తమ సొంత జిల్లాలకు కేటాయించవలసిందిగా బదిలీ సాధన సమితి తరపున కోరుకుంటున్నట్లు తెలిపారు.

కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు 2000 -2006 వరకు ప్రిన్సిపాల్ ద్వారా జిల్లా స్థాయిలో 2007-2011 వరకు ఆర్జేడీ ద్వారా జోనల్ స్థాయిలో నియామకాలు చేయడం జరిగిందని తెలుపుతూ జోనల్ స్థాయి లో నియామకాలు వలన సొంత జిల్లా నుండి సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ బదిలీ లేక మానసిక వేదనతో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

నవంబర్ 15, 2020వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు వారి అర్హత అనుభవం మేరకు ఇతర కళాశాలల్లో పనిచేయడానికి అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని… అయినప్పటికి వరకు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఎటువంటి బదిలీల మార్గదర్శకాలు విడుదల కాలేదని వాపోయారు.

ఇకనైనా ప్రభుత్వం కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు నూతన జిల్లా, జోన్, మల్టీ జోన్ల ప్రకారం వారివారి సొంత జిల్లాలకు కేటాయించవలసిందిగా బదిలీ సాధన సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, శ్రీనాథ్, రాముడు, ముఖ్య సమన్వయ కర్త నూనె శ్రీనివాస్, మహిళా కార్యదర్శులు సుజాత, మంజుల ఉపాధ్యక్షులు సైదులుగౌడ్, ప్రవీణ్ కుమార్, రవీందర్, సంజీవయ్య కార్యదర్శులు కృష్ణ, రమేష్, విప్లవ రెడ్డి, పాపారావు, మీడియా కార్యదర్శి సోహైల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గజ్జ శ్రీనివాస్,రాష్ట్ర నాయకులు సుదర్శన్, సతీష్, శ్రీనివాస్ గౌడ్ అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు కోరడం జరిగింది.