పాస్ నిర్ణయం పట్ల హర్షం – TIGLA, TIPS

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దృష్ట్యా ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు వాస్తవ పరిస్థితులను గమనించి మానవీయకోణంలో ఆలోచించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులను మినిమం పాస్ మార్కులతో పాస్ చేయడానికి “TIGLA-TIPS స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు జంగయ్య, రామకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, నగేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలోనే ప్రత్యక్ష తరగతులు జరగకపోవటం వల్ల ఇప్పుడే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణ వద్దని విద్యావేత్తల, నిపుణుల సలహాలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును, ప్రభుత్వాన్ని మా సంఘం తరపున విజ్ఞప్తి కూడా చేసామని గుర్తు చేశారు.

ఫెయిల్ అయిన అందరి విద్యార్థులను మినిమం పాస్ మార్కులతో పాస్ చేయాలని మంచి నిర్ణయం చేసిన, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.