ఫెయిల్ అయిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేయడం పట్ల హర్షం

గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ దామెర ప్రభాకర్, జనరల్ సెక్రటరీ దార్ల భాస్కర్

హైద్రాబాద్: కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా వాయిదా పడి..తర్వాత నిర్వహించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో ఫెయిలైన 51% అనగా దాదాపు 2 లక్షల 35 వేలకు పైగా ఉన్న విద్యార్థులను మినిమం మార్కులతో పాస్ చేస్తూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థులు మరో 3 నెలల్లో 2వ సంవత్సరం పరీక్షలకు సన్నధ్ధం కావాల్సిన పరిస్తితులలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని, పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ లకు గెస్ట్ లెక్చరర్ల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.