కేసీఆర్ మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం తెలిపిన హేమచందర్ రెడ్డి


సూర్యాపేట జిల్లా :: ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో కేవలం 49 శాతం మంది మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మానవీయ కోణంలో తీసుకున్న నిర్ణయాన్ని విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఫెయిల్ అయిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులను కనీసం మార్కులతో పాస్ చేస్తున్నట్లు ఈరోజు కొద్దిసేపటి క్రితం చేసిన ప్రకటనను TGCCLA- 711 సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మారం హేమచందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనపర్తి శ్రీనివాస్ స్వాగతిస్తూ… విద్యార్థుల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది

ఈ సందర్భంగా మారం హేమచందర్ రెడ్డి మాట్లాడుతూ… TGCCLA-711 రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం మరియు ప్రధాన కార్యదర్శి శేఖర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు కావడంతో సిగ్నల్ ప్రాబ్లం మొదలైన కారణాల వల్ల వాటిని వారు వినడానికి పరిస్థితులు అనుకూలించక పోవడం కారణాలతోపాటు, పదవ తరగతి విద్యార్థులను డైరెక్టుగా ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేయడం మూలంగా ఎక్కువ మంది ఇంటర్మీడియట్ ఫస్టియర్ నందు ఫెయిల్ కావడం జరిగిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిన ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులందరికీ మినిమం పాస్ మార్కులు ఇచ్చి వారిని పాస్ అయినట్టుగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో తక్షణమే ప్రకటించాలని సంఘం పక్షాన వారికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.