నాగర్ కర్నూల్ జిల్లా బదిలీల సాధన సమితి కార్యవర్గం ఏర్పాటు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకుల “బదిలీల సాధన సమితి” కార్యవర్గాన్ని గురువారం నాడు రాష్ట్ర కన్వీనర్ సి. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాముడు, శ్రీనాథ్ పర్యవేక్షణలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

జిల్లా అధ్యక్షులుగా టి. వసంత కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి. పరశురాం, కోశాధికారిగా ఏస్. శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులుగా లింగరాజు, యుగంధర్, ప్రవీణ్ కుమార్, గురునాథ్ రెడ్డి, కార్యదర్శిగా ఎం.డి. యూనుస్, రమేష్, వీరయ్య మహిళా కార్యదర్శిగా విజయలక్ష్మి, సభ్యులుగా జమీల్ పాషా, మహేశ్వర్ రెడ్డి, విష్ణు, అంజనమ్మ లను ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… బదిలీ సాధన సమితి ఆధ్వర్యంలో త్వరలోనే బదిలీలు సాధిస్తామని, అందరి మానసిక ఆవేదన తీరుతుందని పేర్కొన్నారు. చాలా శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీలు జరిగాయని… ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగలేదని… కావున బదిలీలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే నాగర్ కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించిన బదిలీల సాధన సమితి గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డికి, రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.