తాడ్వాయి ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ విద్య

  • కళాశాలకు పటేల్ శ్రీదర్ రెడ్డి, రమేష్ రెడ్డిలు లక్ష రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ప్రొజెక్టర్ డిజిటల్ సాధనాల దానం
  • ఆదివాసీ విద్యార్థులు ఆధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహనతో డిజిటల్ అక్షరాస్యత పెంచుకోవాలి – ఎమ్మెల్యే సీతక్క
  • కళాశాలను నమూనగా మారుస్తున్న ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ కు అభినందనలు

డిజిటల్ యుగంలో మూస భోధనా విధానాలకు స్వస్తి చెప్పి సృజనాత్మక విధానాలకు చోటు ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

స్థానిక తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇంటర్ విద్య ఆద్యుడు మాజీ భారత ప్రధాని పి.వి. నరసింహ రావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు పటేల్ శ్రీదర్ రెడ్డి, రమేష్ రెడ్డిలు అందించిన లక్ష రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ప్రొజెక్టర్ డిజిటల్ సాధనాలను బహుకరించారు.

సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు ఆధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహనతో డిజిటల్ అక్షరాస్యత పెంచుకోవాలని కోరారు. విద్యా ఉపాధి అవకాశాలలో ఆకాశం హద్దుగా ఎదగాలని కోరారు.

దాత పటేల్ శ్రీధర్ మాట్లాడుతూ సాంకేతిక హంగులతో డిజిటల్ శిక్షణ శాల, సెమినార్ హాల్ తాడ్వాయి కళాశాలలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

కళాశాలను నమూనగా మారుస్తున్న ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ ను అధ్యాపకులను అభినందించారు.

ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల అవసరాలను తెలుసుకుంటూ పరిష్కరించుకుంటూ తోడ్పాటు అందిస్తున్న సీతక్కకు కృతజ్ఞతలు తెలియచేశారు. అన్ని ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత బస్ పాస్ లు అందించే విధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు.

ఈ సమావేశంలో సర్పంచ్ సునీల్, యువజన నాయకులు బొల్లు దేవేందర్, అదిరెడ్డి, లచ్చు పటేల్, అధ్యాపకులు రాములు నాయక్, రాజు, మూర్తి, రాజ్ కుమార్, శ్వేత, నాగరాజు, శ్రీలత, అశోక్, బిక్షం విద్యార్థులు పాల్గొన్నారు.