వికారాబాద్ జిల్లా బదిలీ సాధన సమితి కార్యవర్గం ఏర్పాటు

బదిలీ సాధన సమితి, వికారాబాద్ జిల్లా కార్యవర్గం రాష్ట్ర కన్వీనర్ సి. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ పర్యవేక్షణలో రాష్ట్ర కౌన్సిలర్ గట్టగోని. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎండి అన్వర్, ప్రధాన కార్యదర్శి గా శ్రీధర్, కోశాధికారిగా పి. ఆనంద్ కుమార్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ఎన్ నరసింహ, మహిళా కార్యదర్శిగా నగ్నినీన్ బేగం, కార్యదర్శిగా ఉపేందర్ రావు, సభ్యులుగా వంశీ, కే వినోద్ కుమార్ లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు వెంటనే బదిలీలు జరిపించాలని కోరారు. బదిలీలు లేకపోవటం వలన 13 సంవత్సరాలుగా తల్లిదండ్రులకు, బంధువులకు దూరంగా పని ఉద్యోగం చేస్తూ మానసికంగా ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. బదిలీ సాధన సమితి ఆధ్వర్యంలో బదిలీలు జరిగేవరకూ మేము కృషి చేస్తామని ప్రకటించారు.

బదిలీ సాధన సమితి వికారాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు, బదిలీ సాధన సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రెడ్డికి, రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.