సీడీఎల్స్ రెన్యూవల్ పట్ల కనకచంద్రం, వినోద్ కుమార్ హర్షం

ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు రెన్యూవల్ జీవో విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్ధికమంత్రి మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కమిషనర్ నవిన్ మిట్టల్ లకు జేఏసీ చైర్మన్ సీహెచ్ కనకచంద్రం, తెలంగాణ డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.

ఈ సందర్భంగా TGDCLA 900 రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ , జనరల్ సెక్రెటరీ కదారవల్లి , వర్కింగ్ ప్రెసిడెంట్ లు కిరణ్మయి, Dr.మహేష్ కుమార్, రాష్ట్ర నాయకులు బాలరాజు, Dr. బ్రహ్మం, సంజీవ రెడ్డి, Dr. నగేష్, అరుణ కుమారి‌, శ్యామ్, రాజు, కాంతయ్య, వెంకటేష్, హాబీబ్ జానీ, ప్రమీల , కల్పన ధన్యవాదాలు తెలిపారు.

తప్పులు ఉంటే సంఘం దృష్టికి తీసుకురావాలి :

ఈ సందర్భంగా రెన్యూవల్ ఉత్తర్వులలో స్వల్ప మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, కావునా కాంట్రాక్టు లెక్చరర్ లు ఎవరూ ఆందోళన చెందవద్దని జేఏసీ లేదా టీజీడీఎల్ ఎ దృష్టికి తీసుకువస్తే సవరణ ఉత్తర్వులు త్వరలో జారీ చేపిస్తామని కనకచంద్రం, వినోద్ కుమార్ లు ఒక ప్రకటన లో తెలిపారు.