NSS ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలు

కొడిమ్యాల : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోజున జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపల్ జే. ఇందుర గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, శ్రీనివాస్ రామానుజన్ యొక్క కృషిని కొనియాడుతూ, అతనిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోని ముందువెళ్లాలని, అలాగే కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి డా. పి. తిరుపతి మాట్లాడుతూ NSS విద్యార్థులు నిరంతర సాధన ద్వారా గణిత శాస్త్రం జ్ఞానం పెంపొందించుకోవాలని, పోటీ పరీక్షలలో గణితం అత్యంత ప్రాధాన్యత కల్గిన సబ్జెక్టు అని పేర్కొన్నారు.

అనంతరం NSS వాలంటీర్సు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు నర్సయ్య, బాలకృష్ణరెడ్డి, ప్రభాకర్, జయపాల్ రెడ్డి, భాస్కర్, సుమన్, జయశీల, అనిల్ కుమార్, బాలాజీ సింగ్, ప్రవీణ్ కుమార్, ఆఫీస్ సిబ్బంది బి.రవీందర్, రాజేశ్వరి,సుజాత మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.