జాతీయసేవాపథకం ఆధ్వర్యంలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

హుస్నాబాద్ : ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నందు జాతీయసేవా పథకం ఆధ్వర్యంలో ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ యొక్క జయంతిని పురస్కరించుకొని గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్. ఎస్.ఎస్. చైర్మన్ నల్ల రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ఎన్. ఎన్.ఎస్. చైర్మన్ నల్లరామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థినులు మరియు ఎన్. ఎస్.ఎస్.ళవాలంటీర్లు రీజనింగ్ మరియు మానసిక సామర్థ్యాలు అలవర్చుకొని ఏకాగ్రతతో చదివి పోటీ పరీక్షలలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థినిలు శ్రీనివాస రామానుజన్ ని అదర్శంగా తీసుకొని పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు.

గణిత శాస్త్ర అధ్యాపకులు బతిని లక్ష్మయ్య మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ యొక్క కుటుంబ నేపథ్యాన్ని మరియు అతని యొక్క జీవిత అనుభవాలను, గణిత శాస్త్ర పరిశోధనలను విద్యార్థినిలకు వివరించారు. విద్యార్థినిలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనలన్నారు.

అనంతరము గణితశాస్త్ర అధ్యాపకునికి జ్ఞాపిక మరియు శాలువతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఎన్. ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి డి.కరుణాకర్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డి.రవీందర్, పి.వరుధిని, ఎస్.సదానందం, ఎస్.కవిత, కె.స్వరూప, జి.కవిత, పి.రాజేంద్రప్రసాద్, టి.రాజు, అధ్యపకేతర బృందము సీనియర్ అసిస్టెంట్ టి. పద్మ, జూనియర్ అసిస్టెంట్ ఎం.గట్టవ్వ, రికార్డ్ అసిస్టెంట్ టి.భాగ్యాలక్మి, ఎన్. ఎస్.ఎస్.వాలంటీర్లు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.