మహబూబ్ నగర్ జిల్లా బదిలీ సాధనా సమితి కార్యవర్గం

బదిలీ సాధనా సమితి రాష్ట్ర కన్వీనర్ సి నరసింహారెడ్డి, ముఖ్య సమన్వయకర్త నూనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ పర్యవేక్షణలో మహబూబ్ నగర్ జిల్లా బదిలీ సాధనా సమితి కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది.

మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులుగా చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా జి. నరసింహుడు యాదవ్, కోశాధికారిగా కె. విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా భీమిరెడ్డి, సెక్రెటరీగా ప్రవళిక, సభ్యులుగా రతన్ లాల్ నాయక్, అరవింద్ సుగునేశ్ కుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు లేకపోవటం ఫలితంగా గత 13 సంవత్సరాలుగా కుటుంబాలకు సుదూరంగా పని చేస్తున్నామని… కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా పని చేయటం వలన తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నామని తెలిపారు. కావున బదిలీలు వెంటనే జరపాలని పేర్కొన్నారు.