సీడీఎల్స్ రెన్యూవల్ ఉత్తర్వులు పట్ల 475 సంఘం హర్షం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ ల & అవుట్సోర్సింగ్ వారిని ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ చేస్తూ ఆర్థిక శాఖ జీవో నంబర్ 2457 విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (475) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ.రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.