యాదాద్రి బోనగిరి జిల్లా బదిలీల సాధన సమితి కార్యవర్గం

బదిలీ సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ సి నర్సింహారెడ్డి, ముఖ్య సమన్వయకర్త నూనె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్ ల పర్యవేక్షణలో యాదాద్రి బోనగిరి జిల్లా కార్యవర్గం ఎన్నిక జరిగింది.

అధ్యక్షులుగా ఎన్. రమేష్, ప్రధాన కార్యదర్శిగా జి. విజయ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ గా జి సైదులు, ఉపాధ్యక్షులు ఎం.డి. అష్రప్ హుస్సేన్, బి పద్మ జాబాయి, సెక్రెటరీగా వై. విద్యాసాగర్, మహిళా కార్యదర్శిగా వి. లావణ్య, సభ్యులుగా గంగ, లక్ష్మి, విజయ, వనిత, స్వప్న లు ఎన్నికయ్యారు.

ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ… కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలు జరగవలసిన అవసరం ఉందని వీటిని సాధించే వరకూ కృషి చేస్తామని తెలిపారు. అలాగే బదిలీ సాధన సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.