సంగారెడ్డి జిల్లా “బదిలీ సాదన సమితి” కార్యవర్గం

సంగారెడ్డి జిల్లా : ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల “బదిలీ సాధన సమితి” కార్యవర్గాన్ని రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త నూనె శ్రీనివాస్ పర్యవేక్షణలో రాష్ట్ర కార్యదర్శులు సుదర్శన్, రమేష్ ల ఆధ్వర్యంలో లో ఎంపిక చేయడం జరిగింది.

జిల్లా అధ్యక్షులుగా కే. తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా ఎం. సత్యనారాయణ, కోశాధికారిగా పి. సురేష్, ఉపాధ్యక్షులుగా సైదయ్య, కార్యదర్శిగా నరసింహ, సహ కార్యదర్శిగా వెంకట్ రెడ్డి, సభ్యులుగా రాములు, ఒంప్రకాష్, మల్లేశం, సైదాచారిలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే. తిరుపతి, ఎం. సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీలలో జరిగేంత వరకూ కృషి చేస్తామని తెలిపారు. మరియు బదిలీసాధన సమితి గౌరవ అధ్యక్షులు, డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కన్వీనర్ సి నరసింహ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోతిలాల్ నాయక్, రాముడు, శ్రీనాద్, ముఖ్య సమన్వయకర్త నూనె శ్రీనివాస్ కి కార్యవర్గం తరపున కృతజ్ఞతలు తెలిపారు.