ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్ పల్లి విద్యార్థులకు కలెక్టర్ సన్మానం

రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్ పల్లి ఎం.పి.హెచ్.డబ్ల్యూ (ఎఫ్) మొదటి సంవత్సరం విద్యార్థులు ఎల్ వసంత, 500 మార్కులకు గాను 475 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం, కె సవిత 500 మార్కులకు గాను 474 మార్కులను సాధించి రాష్ట్రస్థాయి ద్వితీయ స్థానం సాధించడం జరిగింది.

విద్యార్థులను సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్, అడిషనల్ కలెక్టర్ ఎం ఎస్ చిత్ర మిశ్రా అభినందించారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి విజయాలు ఇంకా సాధించాలని విద్యార్థులను, కళాశాల సిబ్బందిని కూడా అభినందించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా డిఐఈఓ లోలం రఘురాజ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్ పల్లి ప్రిన్సిపాల్ చంద్ర విఠల్, తదితరులు పాల్గొన్నారు.