తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల అబివృద్దికి కృషి చేస్తా – ఎమ్మెల్యే సీతక్క

  • 50 వేలు విలువ గల నోటు పుస్తకాలను, బ్యాగ్ లను విద్యార్థులకు పంపిణీ
  • కళాశాల అబివృద్దికి ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ సేవలు నిరూపమాణం – సీతక్క
  • కళాశాల టాపర్లకు సన్మానం

ఈ రోజు తాడ్వాయి మండల కేంద్రంలో ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్ విద్య వికాసం ప్రజా ప్రతినిధులు, పౌర సమాజం పాత్రపై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శరీరానికి వ్యాయామం లాగా మెదడుకు నిరంతర అధ్యయనము అవసరమని ములుగు శాసనసభ్యులు ధనసరి సీతక్క అన్నారు. చదువు నేర్చుకునే ప్రక్రియలో, సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రశ్నించడం అలవర్చుకోవాలని, సంభాషణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అదే సమాజ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. ఏజెన్సీలోని తాడ్వాయి కళాశాల వికాసం కోసం ప్రభుత్వాన్ని, పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేస్తూ ప్రతిభా జ్ఞానశాలగా మారుస్తున్న ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ ను అభినందించారు.

ఇటీవల ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్స్ గా నిలిచిన సిరివెన్నెల, కల్యాణి, నందిని, భరత్, సాయి కిరణ్, శ్రావ్యలను సన్మానించారు.

వచ్చే విద్యా సంవత్సరంలో ఉపాధికి ఉపయోగపడే వృత్తి విద్యా కోర్స్ లను అనుమతి తీసుకొస్తానని అన్నారు. 50 వేలు విలువ గల నోటు పుస్తకాలను, బ్యాగ్ లను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ప్రిన్సిపాల్ అస్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ మానవ నాగరికత సాంస్కృతిక భూమికను అందించిన సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం విద్యారంగంలో విరభూయాలనే తపనతో కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ సమావేశంలో సర్పంచ్ సునీల్ దొర, అధ్యాపకులు రాములు నాయక్, అశోక్, బిక్షం, రాజ్ కుమార్, సంధ్య, మూర్తి, కిషన్ రాజు, శ్రీలత, శ్వేత, నాగరాజు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.