ఐక్యతతో క్రమబద్ధీకరణ సాధించుకుందాం : రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లు ఐక్యతతో క్రమబద్ధీకరణ సాధించుకోవాలని ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ (475) అసోసియేషన్ ఆధ్వర్యంలో సలహాదారు డాక్టర్ అందె సత్యం సమన్వయకర్తగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాలతో జరిగిన రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ లో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు విధానంలో వెట్టిచాకిరి చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు అనేక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులు సాధించుకున్నారని, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ వచ్చిందని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు,

ఈ కార్యక్రమంలో పాల్గొన్న AIFACTO జాతీయ సంఘ సభ్యులు డాక్టర్ రత్న ప్రభాకర్ కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పూర్తి మద్దతు ప్రకటించారు.

TIGLA రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు మాట్లాడుతూ ఇంటర్ విద్యలో జరుగుతున్న అవినీతిని అరికట్టడంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ముందుండాలని కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ముందుంటామని పూర్తి సహాయం అందిస్తామని తెలిపారు.

ఇంటర్ విద్యార్థి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను, లెక్చరర్లను క్రమబద్ధీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు.

మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి భూపాల్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య రంగం కాంట్రాక్టు ఉద్యోగులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలని తెలిపారు, ఐక్యతతో క్రమబద్ధీకరణ సాధించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నుండి నవీన్ మరియు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల నుండి డాక్టర్ పడాల జగన్నాథం, ప్రవీన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె.పి శోభన్ బాబు, సయ్యద్ జబీ, గంగాధర్, గోవర్ధన్, శైలజ,సంగీత, పద్మావతి మరియు జిల్లా నాయకులు షాహిన్ విశాలాక్షి మల్లయ్య నాగరాజు, రషీద్, నరసింహరాజు, ప్రేంసాగర్, రాధాక్రిష్ణ మనోహర్, మైనర్టీ సంఘ నాయకులు రహీం పాల్గొన్నారు.