సర్వీస్ ఎక్కువ, పని ఎక్కువ, వేతనం తక్కువ

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఒకేషనల్ పార్ట్ టైం జూనియర్ లెక్చరర్లుగా 1994వ సంవత్సరం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 54 మంది మాత్రమే ఉన్నారు. వీరందరూ 45 సంవత్సరాల వయసు పైబడిన వారే. దాదాపు 25 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.

రెగ్యులర్ లెక్చరర్స్ లాగే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కాలేజీలో ఉంటూ విద్యాబోధన చేస్తూ.. ఫుల్ టైం గా పని చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్స్ 5 కేటగిరీలుగా ఉన్నారు.

(1) రెగ్యులర్
(2) పార్ట్ టైం మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ (1993 ముందు) (3 )పార్ట్ టైం లెక్చరర్స్ (1993 – 1999)
(4) కాంట్రాక్ట్ లెక్చరర్స్ ,(2000 -2013).
( 5). గెస్ట్ లెక్చరర్స్ (2013 తరువాత) .

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1989వ సంవత్సరంలో వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టి వాటిని బోధించుటకు రెగ్యులర్ లెక్చరర్లను నియమించకుండా పార్ట్ టైం పద్ధతిన నియమించారు. ఆ సమయంలో రెగ్యులర్ సిస్టం మరియు పార్ట్ టైం సిస్టం మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ విధంగా 1999 వ సంవత్సరం వరకు నియమిస్తూ వచ్చినారు.

ఈ విధంగా నియమితులైన పార్ట్ టైం లెక్చరర్లలో అనేక మందిని ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. ఈ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ గా, జిల్లా ఇంటర్ విద్యాధికారిగా ఉద్యోగోన్నపొంది వారి సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇంటర్ బోర్డ్ లో కూడా వివిధ హోదాలలో పని చేస్తున్నారు.

రెగ్యులర్ కాకుండా 1993 వ సంవత్సరం వరకు నియమితులైన పార్ట్ టైం లెక్చరర్స్ కు వేతనం అప్పుడు ఉన్న రెగ్యులర్ లెక్చరర్స్ బేసిక్ పే మరియు డి ఎ చెల్లిస్తున్నారు.

2000 – 2001 నుండి నియమితులైన కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు 11 పి ఆర్ సి ప్రకారం చెల్లిస్తున్నారు. 1994 నుండి 1999 వరకు నియమించబడిన పార్ట్ టైం లెక్చరర్ లకు 21,600/ మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. కావునా పార్ట్ టైం లెక్చరర్ లకు కూడా బేసిక్ పే వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకోంటున్నారు.