ఆదివారం కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ ల రౌండ్ టేబుల్ సమావేశం – కొప్పిశెట్టి

కాంట్రాక్ట్ ఉద్యోగుల/లెక్చరర్ల క్రమబద్ధీకరణకు భవిష్యత్ కార్యాచరణ కొరకు రాష్ట్రస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం డిసెంబర్ – 19, ఆదివారం రోజున, ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించడానికి జీవో నెంబర్ 16 తేది 26/02/2016 నాడు జారీ చేయడం జరిగిందని… కొంతమంది వ్యక్తులు హ హైకోర్టుకు వెళ్లడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు.

తాజాగా హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగుల మరియు లెక్చరర్ల క్రమబద్ధీకరణపై ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగించి కేసును కొట్టివేయడం జరిగిందని.. కావున వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ కాంట్రాక్టు ఉద్యోగులు సంఘాల నాయకులు ప్రభుత్వ పెద్దలు పాల్గొంటారని కావునా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

★ భవిష్యత్ కార్యాచరణ సిద్ధం ::

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి డిసెంబర్ -19 న హైదరాబాదులో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని రాష్ట్ర నాయకులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, శోభన్ బాబు, నాయిన శ్రీనివాస్, సయ్యద్ జబి, కంపెల్లి శంకర్, కురుమూర్తి, దేవేందర్, పి. జగన్నాథం, శ్రీమతి ఉదయశ్రీ, శైలజ, ప్రవీణ్, గోవర్ధన్, గంగాధర్, ఎం. శ్రీనివాస్ రెడ్డి, వైకుంఠం, సాయిలు, మధుకర్, రమాదేవి తదితరులు తెలిపారు.