ఫెయిల్ అయిన విద్యార్థులకు ఎప్రిల్ లో పరీక్షలకు అవకాశం

  • పరీక్షలు, ఫలితాలు మీద ఎలాంటి పిర్యాదులు అందలేదు.
  • 50% తగ్గింపు (300/-) తో రీ వెరిపికేషన్ ప్రక్రియ
  • విద్యార్థులకు పరీక్షలను సులభతరం చేయడానికి అనేక చర్యలు చేపట్టాం
  • ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాల పై ఎలాంటి అనుమానాలున్నా విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియను విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన చేసింది. రీకౌంటింగ్ కు 100/- రూపాయలు, రీవెరిఫికేషన్ 600/- రూపాయలుగా ఫీజు నిర్ణయించడం జరిగింది.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు రీ వెరిఫికేషన్ ఫీజును 50% తగ్గిస్తూ అనగా 300/- రూపాయలకే చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.

అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు మార్చిలో నిర్వహించవలసిన పబ్లిక్ పరీక్షలు అక్టోబర్ నెలలో నిర్వహించిందని దీనికోసం పూర్తి స్థాయిలో ఆన్లైన్ తరగతులు, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 23 వరకు భౌతిక తరగతులను, బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ ను, 70% సిలబస్ ను, 50 శాతం చాయిస్ తో ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి విద్యార్థులకు సులభతరంగా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు తగిన చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.

తాజాగా విడుదలైన పరీక్ష ఫలితాలు పట్ల ఎలాంటి పిర్యాదులు తమకు అందలేదని, పూర్తిగా నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెలువరించామని తెలిపారు.

ఎవరైతే విద్యార్థులు అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని బావిస్తున్నారో వారికి ఏప్రిల్ 2022 లో జరిగే పబ్లిక్ పరీక్షలలో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా కమీషనర్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు.