ఉత్తమ ఫలితాలు సాదించిన సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల

ప్రభుత్వ జూనియర్ కళాశాల సంగెం నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ కి చెందిన ఓ. నిఖిత 456 మార్కులను సాదించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడవ స్థానంలో నిలిచిందని, యస్. శ్రీనిధి 416 మార్కులతో కళాశాల ద్వితీయ స్థానం సాధించిందని. బైపీసీ నుండి మహిత 374, వైష్ణవి 343 మార్కులను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు శ్రీధర్, సునీల్ రెడ్డి, అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు