రాష్ట్ర స్థాయి టాప్ ర్యాంకులు సాదించిన ప్రభుత్వ కళాశాల డిచ్ పల్లి విద్యార్దినిలు

ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల డిచ్ పల్లిలో ఎం.పి.హెచ్.డబ్ల్యు కోర్సు చదువుతున్న విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో ఎల్ వసంత,500 మార్కులకుగాను 475 మార్కులు సాధించి మొదటి స్థానం, మరో విద్యార్థిని కే కవిత 500 మార్కులకుగాను 474 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం సాధించటం జరిగింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థినిలను కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర విటల్ అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బి విజయ, నారాయణ, పని కుమార్, అర్చన, మురళి, నరసింహారెడ్డి, ప్రవీణ్, తిరుపతి, సుజాత, శ్రీలక్ష్మి, నీత, శ్రీనివాస్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు