గద్వాల జిల్లా బదిలీ బాధితులు సమితి కార్యవర్గం ఏర్పాటు

గద్వాల :: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల బదిలీ బాధితుల సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శులు రాముడు, మోతిలాల్ నాయక్, శ్రీనాథ్ ఆధ్వర్యంలో బదిలీ బాధితుల సాధన సమితి నూతన కార్యవర్గం ఈ రోజు గద్వాలలో ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్ష, కార్యదర్శులు నరసింహులు, వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యవర్గం ::

అధ్యక్షుడు – నరసింహులు, ప్రధాన కార్యదర్శి – యస్. వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులుగా చలపతి రెడ్డి, శిరీష, మహేందర్ గౌడ్, ట్రెజరర్ గా రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శులుగా రమేష్, రామచంద్రయ్య, జహంగీర్, కార్యవర్గ సభ్యులుగా వెంకటయ్య, నరేష్, బాలస్వామి, ఆంజనేయులు లను నియమించారు.