8 నెలలుగా వేతనాలు లేని పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్స్

  • 28 ఏళ్ళుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్ట్ టైమ్ లెక్చరర్ లుగా విధులు
  • సమాన పనికి సమాన వేతనం, సకాల వేతనాలు అందని వైనం

గత 28 సంవత్సరముల (1993) నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృత్తి విద్య (వొకేషనల్) కోర్సులలో పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్స్ లకు ఏప్రిల్ 2021 నుండి ఇప్పటి వరకు అనగా 8 నెలల నుండి వేతనం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధ్యక్షులు నయిముద్దీన్, ప్రధాన కార్యదర్శి సర్వేశ్వర రావు, సహ అధ్యక్షుడు మురళి మోహన్, పోతు సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వేతనాలు లేక కుటుంబ పోషణ, పిల్లల చదువుల విషయంలో మరియు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర ధరలకు ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతూ, అప్పుల పాలై కుటుంబాన్ని నెట్టుకొని వస్తున్నామని వాపోయారు.

అలాగే వొకేషనల్ పార్ట్ టైమ్ జూనియర్ లెక్చరర్స్ కు ప్రతీ సంవత్సరం 12నెలలు నెలకు 21.600/- రూపాయలు కన్సాలిడేటెడ్ పే గా చెల్లించవలసిందిగా ఉన్నత విద్యా శాఖ జీవోని విడుదల చేసినారు, కానీ దానికి సంబంధించి సపోర్టింగ్ ఆర్డర్స్ ను ఇంత వరకు విడుదల చేయలేదని తెలిపారు.

కావున పై విషయాలు గమనించి గత 28 సం నుండి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను నమ్ముకొని పని చేస్తున్న మాకు పెండింగ్ ఉన్న వేతనాలు ఏప్రిల్ 2021 నుండి ఇప్పటివరకు వెంటనే చెల్లించి మరియు 12 నెలల వేతనమునకు సంభందించిన జీవోకు సపోర్టింగ్ ఆర్డర్స్ విడుదల చేసి మా కుటుంబాలను ఆత్మహత్యలు, ఆకలి చావుల నుండి రక్షించాలని ప్రాదేయపడుతున్నట్లు తెలిపారు.