నారాయణపేట జిల్లా బదిలి సాధన సమితి కమిటీ ఏర్పాటు

నారాయణపేట జిల్లా బదిలి సాధన సమితి కమిటీ కార్యవర్గంను రాష్ట్ర కమిటీ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది.

అధ్యక్షులుగా కృష్ణ, కార్యదర్శిగా రాజు, ట్రెజరర్ గా బసప్ప, వైస్ ప్రెసిడెంట్ లుగా రమేష్, బాలరాజ్, సెక్రెటరీగా సత్యనారాయణ, లేడీ సెక్రటరీగా శోభారాణి, మెంబర్స్ గా నరసయ్య, శ్రీనివాస్, కృష్ణంరాజు లను నియమించడం జరిగిందని నర్సింహారెడ్డి, మోతిలాల్ నాయక్, రాముడు, శ్రీనాద్ లు ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచిన గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డికి, బదిలీ సాదన సమితి రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే బదిలీ సాదించేవరకు విశ్రమించకుండా పోరాడుతామని పేర్కొన్నారు.