వేతనాలు మహాప్రభో…

  • 7 నెలలుగా వేతనాలు లేని పార్ట్ టైం ల్యాబ్ అటెండర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్
  • సమాన పనికి సమాన వేతనం లేదు, పీఆర్సీ అమలు లేదు
  • బంగారు తెలంగాణ లోనూ తప్పని వెట్టిచాకిరి

గత 25 సంవత్సరాల నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్ట్ టైం ల్యాబ్ అటెండర్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ గా పని చేస్తున్న 47 మంది ఉద్యోగులకు గత ఏడు నెలలుగా వేతనాలు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సయ్యద్ ఉర్ రెహమాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా ఏడు నెలల నుండి అనగా జూన్ 2021 నుండి ఇప్పటి వరకు అనగా డిసెంబర్ 2021 వరకు మాకు వేతనాలు విడుదల చేయలేదు. మాకు ఏ నెల వేతనం ఆ నెల ఇవ్వక పోవడం వలన కుటుంబ పోషణ మరియు పిల్లల చదువుల విషయంలో ఆర్థిక ఇబ్బందులు గురి అవుతున్నామని… ప్రస్తుత తరుణంలో ఏ నెల వేతనం ఆ నెల ఇచ్చిన సరి పోని రోజులలో మాకు గత 7 నెలల నుండి వేతనం ఇవ్వక పోవడం వలన ఇటు ఇంటి అద్దెలు, రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్న నిత్యావసర ధరలకు సరుకులు మరియు కూర గాయాలు కొనుక్కోలేక అప్పులపాలై చస్తు బ్రతుకుతూ జీవితాలు నేట్టుకొని వస్తున్నామని తమ బాధను వెల్లబోసుకున్నారు.

2017వ సంవత్సరం నుండి నెలకు 7800/- అదికూడా పది నెలల కాలనికే వేతనం ఇస్తున్నారని నూతన పీఆర్పీ ప్రకారం మరియు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విన్నవించుకున్నారు.

ముఖ్యంగా గత 25 సంవత్సరాల నుండి జూనియర్ కళశాలల్లో వృత్తి విద్య ల్యాబ్ లో పనిచేయించుకుంటూ అదనంగా అటెండర్ పని నుండి అడ్మిషన్స్ పని, స్కాలర్ షిప్స్ పని, ఎగ్జామినేషన్ పని, టైపిస్ట్ పని, కంప్యూటర్ ఆపరేటర్ పని, వేతనాల బిల్స్ పని, STO పని, బ్యాంక్ పని, పోస్టల్ పని మరియు అన్ని రకాల పనులు చేయుంచుకొంటు మా యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారని వాపోయారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ అదికారులు వెంటనే స్పందించి తమకు రావలసిన పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయవలసిందిగా విన్నవించుకుంటున్నట్లు సయ్యద్ ఉర్ రెహమాన్ కోరారు.