మందాల స్రవంతికి డీఐఈవో అభినందనలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ దర్మకంచ జనగామ నందు ఎం పీ సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంధాల స్రవంతి ని జిల్లా ఇంటర్ విద్యాధికారి బైరి శ్రీనివాస్, కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శతి నందినీ పటేల్ అభినందించారు.

హరేకృష్ణ ఫౌండేషన్ జనగామ వారి ఆధ్వర్యం ఇటీవల భగవత్ గీత పై వ్యాస రచన పోటీలు, శ్లోకాలపై పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో మాందాల స్రవంతి జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి రూపాయలు ఐదు వేల నగదు బహుమతి గెలుచుకొంది. మంగళవారం గీతా జయంతి ని పురస్కరించుకొని హరేకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యం లో జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో జిల్లా ఇంటర్ విద్య అధికారి బైరి శ్రీనివాస్ మరియు ఫౌండేషన్ సభ్యులు స్రవంతికి ఈ నగదు బహుమతి,ప్రశంసా పత్రం అందజేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డీఐఈఓ బైరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే వివిధ రకాల వ్యాస రచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరచి అన్ని రంగాలలో ముందుంటునారని కొనియాడారు. కార్యక్రమం లో కళాశాల అధ్యాపకులు మరిపెళ్ల రవి ప్రసాద్, బట్టు రేఖ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.