విద్యార్థులకు సాహిత్యం పై అవగాహన

కామారెడ్డి జిల్లా :: తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నెల నెలా కవితా యజ్ఞము కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సాహిత్యం పై అవగాహన కల్పించారు.

ముఖ్య అతిథిగా సర్పంచ్ బండారు సంజీవులు, కవితా శిక్షకులు ప్రముఖ కవి, రచయిత శ్రీ తిరుమల శ్రీనివాస ఆర్య సాహిత్య అవగాహన చరిత్ర పరిశోధకులు కవి కంకణాల రాజేశ్వర్, జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అనంత్ శ్రీరాములు, కామారెడ్డి జిల్లా కవి వ్యాఖ్యాత సిరీగాద శంకర్, కవి రవీందర్ మరియు కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ యూసుఫ్ హుస్సేన్, అధ్యాపకులు సువర్ణ, సంతోష్, శ్రీనివాస్, వీరేశం, మల్లేశం, సతీష్ చంద్ర, సరస్వతి, కవిత, శ్రీకాంత్, సతీష్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.