ఘనంగా వెల్ కమ్ పార్టీ

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్ నగర్ లో అలరించిన విద్యార్థులు
  • హజరైన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి

సూర్యాపేట జిల్లా : ప్రభుత్వ జూనియర్ కళాశాల హుజూర్ నగర్ నందు వెల్ కమ్ పార్టీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జూనియర్ లకు సీనియర్ లు స్వాగతం పలుకుతూ ఆటపాటలతో విద్యార్థులు అలరించారు.

ఈ కార్యక్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మరియు కళాశాల ప్రిన్సిపాల్ జానపాటి కృష్ణయ్య, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ విడిఎస్ ప్రసాద్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జానపాటి కృష్ణయ్య ప్రసంగిస్తూ విద్యార్థులు ర్యాగింగ్ లాంటి విషపూరితమైన సంస్కృతికి స్వస్తి పలుకుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సోదరభావంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలకడమే ఈ వెల్ కమ్ పార్టీ ఉద్దేశమని… ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణ, పట్టుదలతో విద్యార్థులు విద్యను ఆర్జించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ VDS ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరై విలువైన సలహాలు, సూచనలు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

విద్యార్థులు అనేక నృత్య రూపాలు మరియు నాటికలు చక్కగా ప్రదర్శించినందుకు వారు పొందుతున్న నాణ్యమైన ఉచిత విద్య ఇతర మౌలిక సదుపాయాల గురించి తమ అభిప్రాయాలు తెలిపిన విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యా అధికారి కృష్ణయ్యకు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి సన్మానించడం జరిగింది.

గెస్ట్ అధ్యాపకులు కార్యక్రమానికి హాజరైన సూర్యాపేట జిల్లా ఇంటర్ విద్యా అధికారి మరియు ఇన్చార్జి ప్రసాద్ లకు శాలువా కప్పి సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్, లైబ్రేరియన్ గుర్రం నాగరాజు అధ్యాపక అధ్యాపకేతర బృందం కళాశాలలో రాజనీతి శాస్త్రం బోధించే అధ్యాపకుడు మారం హేమచందర్ రెడ్డికి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించి సన్మానించి… కళాశాల విద్యార్థుల శ్రేయస్సుకోసం ఈ విద్యాసంవత్సరంలో ఒక తెలుగు మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని కళాశాల లైబ్రరీకి సొంత ఖర్చులతో వేయించి పోటీ పరీక్షల వైపు విద్యార్థులను ఇంటర్మీడియట్ నుంచి సమాయాత్తం చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి అరుణ, నాగరాజు, నరసింహారావు, బ్రహ్మచారి, శ్రీనివాస్ రెడ్డి, హేమచందర్ రెడ్డి, బుస్సా మహేష్, రామ్మూర్తి, వీరన్న, నాగుల్ మీరా, రమేష్, రమణారెడ్డి, ఉపేంద్ర, టైపిస్ట్ సృజన్ కుమార్, రికార్డు అసిస్టెంట్ అశోక్, గెస్ట్ అధ్యాపకులు రాములు, నరసింహారెడ్డి, ముస్తఫా, రాము మరియు సోమయ్య తదితరులు పాల్గొన్నారు