75 వేల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ ఫెయిర్ & JNTUH

75 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జేఎన్టీయూహెచ్, నిపుణ, సేవా ఇంటర్నేష నల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్18, 19 తేదీల్లో ‘మెగా జాబ్ ఫెయిర్’ ను నిర్వహిస్తున్నట్టు నిపుణ సంస్థ ఫౌండర్ సుభద్రారాణి తెలిపారు.

జేఎన్టీయూహెచ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో కాలేజీ ఆవరణలో డిసెంబర్18, 19 తేదీల్లో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తామని, 150కి పైగా కంపెనీలు పాల్గొంటాయని వివరించారు. టెన్త్, ఇంటర్, బీఈ, బీటెక్, డిగ్రీ/పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన నిరుద్యోగులకు ఐటీ, ఐటీఈఎస్, కోర్, మేనేజ్ మెంట్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు.

ఇందుకోసం ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని కేవలం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లో ముందస్తు రిజిస్టేషన్ చేసుకోవాలని చెప్పారు.

వెబ్సైట్ :: www.nipunahds.com

మరిన్ని వివరాలకు ::

9848484264,
8790006745
నంబర్లను సంప్రదించాలని సూచించారు.