కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బదిలీ సాధన సమితి కార్యవర్గం ఏర్పాటు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బదిలీ సాధన సమితి మొదటి, నూతన కార్యవర్గం ఈ రోజు ఏర్పాటు కావడం జరిగింది. ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి గౌరవ అధ్యక్షులు ఏర్పాటైన బదిలీ సాధన సమితి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పాముల సోమన్న, ప్రధాన కార్యదర్శులుగా సంతోష్ కుమార్, నవీన్ రెడ్డి లను నియమించుకున్నారు.

బదిలీల సాదనే ధ్యేయంగా, బదిలీ ల పై సీఎం కేసీఆర్ హమీ అమలే లక్ష్యంగా బదిలీ సాదన సమితి ఎర్పడిందని సోమన్న, నవీన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా తమకు అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బదిలీ సాదన సమితి కార్యవర్గంలో కోశాధికారిగా రామరావు, సహ అధ్యక్షులుగా విజయ్, రజిత, సెక్రటరీలుగా రాజు, సుమలత, సభ్యులుగా శారద, భూలక్ష్మీ, రవి, రాజ్యలక్ష్మి, శ్రీనివాస్, నవీన్, రజిత, సురేష్, గణేష్, దీప్తి, అనిల్, లక్ష్మణ్, మోంజీ లను నియమించినట్లు ప్రకటించారు.