నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని, ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో 705 కళాశాలల మూత అంటూ ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని శనివారం మంత్రి తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టంచేశారు. రానున్న కాలంలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. చదువుకోవాలన్న కోరిక ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలి పారు. ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో సరిపడా సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రపంచ వ్యా ప్తంగా విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్సుల రూపకల్పన చేస్తున్నామని వెల్లడిం చారు. ప్రభుత్వం ప్రారంభించిన గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడిందని వివరించారు.

రాష్ట్ర ఏర్పాటుకు ముందు సోషల్, ట్రైబల్, బీసీ, మైనార్టీ సంక్షేమ, టీఆర్‌ఈఐఎస్ పాఠశాలలు 294 ఉంటే, ఇప్పుడు 942 కు పెంచామని, 404 జూనియర్ కాలేజీల్లో సుమారు రెండు లక్షలమంది విద్యార్థులు చదు వుతున్నారంటే, విద్యలో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణమని ఆమె పేర్కొన్నారు.

credits : ntnews