సబితా ఇంద్రారెడ్డి ని కలిసిన కాంట్రాక్టు అధ్యాపకులు

కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు హైకోర్టు సానుకూలంగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని 475 అసోసియేషన్ మరియు పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి దృష్టికి జీవో నంబర్ – 16 పై హైకోర్టు సానుకూల తీర్పు మరియు కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు అప్షన్స్ అవకాశం కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని హమీ ఇచ్చారని శోభన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రిని కలిసిన వారిలో 475 సంఘ నాయకులు శోభన్ బాబు, సంగీత, మనోహర్, నవీన్ మరియు పలువురు పాలిటెక్నిక్ కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు.