కళాశాల స్థాయి బోధనలో చరిత్రకు ప్రాధాన్యత ఇవ్వాలి : చరిత్ర పరిరక్షణ సమితి

వరంగల్ ::చరిత్ర పరిరక్షణ సమితి తెలంగాణ ఆధ్వర్యంలో ఆదివారం రోజున కాకతీయ విశ్వవిద్యాలయము యందు నేటి విద్యా వ్యవస్థలో చరిత్ర అధ్యయన ఆవశ్యకత అంశం పై జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చరిత్రను పాఠ్యాంశం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు.

డా. పి. సదానందం‌ చరిత్ర శాఖాధిపతి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలన్నింటిలో వెంటనే చరిత్రను సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ కె. విజయ బాబు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర సంస్కృతి గొప్పదనం పేర్కొంటూ విద్యార్థులకు తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమ చరిత్ర తెలిసేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ టి. మనోహర్ మాట్లాడుతూ సమాజంలోకి చరిత్రను తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

రిటైర్డ్ ప్రొఫెసర్ టి. దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర విద్యార్థులకు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా. అంజయ్య, డా. రమేష్, డా. జి. యాదవరెడ్డి, డా. ఆకులపెల్లి కుమారస్వామి మరియు చరిత్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు డా. తిరుపతి పోతరవేణి, వ్యవస్థాపకులు డా.తిరుపతి సందవేణి, ప్రధాన కార్యదర్శి మల్లేష్ చంద్ర, కుందరావు సతీష్, అధ్యాపకులు, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, చరిత్ర కారులు పాల్గొన్నారు.