బదిలీ సాదన సమితి ఏర్పాటుకు శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 12 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ పి. మధుసూదన్ రెడ్డి గౌరవ అధ్యక్షుడిగా బదిలీ సాదన సమితి ఏర్పాటు చేశామని నర్సింహారెడ్డి తెలిపారు.

12 సంవత్సరాలుగా బదిలీలు లేక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల సాదనే లక్ష్యంగా ఈ బదిలీ సాదన సమితి ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ బదిలీలు జరపండని చెప్పి సంవత్సరం దాటినా బదిలీలు జరగపోవడంతో తీవ్ర నిరాశతో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారని వాపోయారు.

DOWNLOAD “BIKKI NEWS APP” FOR MORE UPDATES

బదిలీ సాదన సమితి త్వరలోనే పూర్తి స్థాయిలో రాష్ట్ర, జిల్లా బాడీలను ఏర్పాటు చేస్తామని… ప్రభుత్వం జరిపిన ఎలాంటి బదిలీలకైనా సిద్ధంగా ఉన్న వారు కలిసి రావాలని నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

కార్యవర్గం వివరాలు ::

కన్వీనర్ సీ. నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శులు మోతీలాల్ నాయక్, రాముడు, శ్రీనాద్, ముఖ్య సమన్వయ కర్త నూనె శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గజ్జె శ్రీనివాస్, మహిళా కార్యదర్శులు సుజాత, మంజుల, ఉపాధ్యక్షులు సైదులు గౌడ్, ప్రవీణ్ కుమార్, రవీందర్, సంజీవయ్య, కార్యదర్శులు కృష్ణ, రమేష్‌, విప్లవ రెడ్డి, పాపారావు లుగా ఎన్నుకున్నారు.