సీజేఎల్స్ టీడీఎస్ మరియు నెలనెలా వేతనాల పై తక్షణమే చర్యలు తీసుకోవాలి – TIPS

  • తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి డిమాండ్
  • బడ్జెట్ ఉండి కూడా నెలనెలా వేతనాల అందుకోలేకపోతున్న సీజేఎల్స్
  • ఎంప్లాయి – ఎంప్లాయర్ సంబంధంలో టీడీఎస్ పై తక్షణమే స్పష్టత ఇవ్వాలి
  • TIPS జంగయ్య, రామకృష్ణ గౌడ్ ల డిమాండ్

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 20 సంవత్సరాల నుండి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాల నుండి ఏప్రిల్, 2021 నుండి TDS రూపంలో 10% ప్రతి నెల చెల్లించే వేతనాలు నుండి కట్ చేస్తున్నారు. ఈ విషయంపై తమరికి పలుమార్లు విన్నవించడం జరిగింది కానీ తమరు ఈ విషయంపై ఇప్పటివరకు వివరణాత్మకమైన నిర్ణయము తీసుకోలేదని వెంటనే చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ఒమర్ జలీల్ ను TIPS జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియమింపబడి సంవత్సరంలో పూర్తిగా 12 నెలల వేతనంతో పని చేస్తున్నారు వీరికి ప్రతి నెల ఒక CL, వివాహిత మహిళలకు మెటర్నటీ లీవ్ (వేతనం లేకుండ) 2 నెలలు పని చేస్తున్నారు, ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేస్తున్నారు కావున వీరికి ప్రభుత్వానికి మధ్యన ఎంప్లాయ్ మరియు ఎంప్లాయర్ సంబంధం మాత్రమే ఉందని గమనించి ప్రతి నెల వీరికి చెల్లిస్తున్న వేతనం నుండి ప్రొఫెషనల్ టాక్స్ (PT) కూడా కట్ చేయడం జరుగుతుంది. కావున తమరు పై విషయాలను పరిగణలోకి తీసుకొని వీరికి TDS 194J కాకుండా 192 క్రిందకి పరిగణిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ…

డీడీవోలుగా ప్రిన్సిపాల్ లకు అధికారం ఇవ్వాలి ::

ప్రభుత్వము మరియు తమరు ప్రతి
నెల వీరికి వేతనాలు మంజూరు చేస్తున్నప్పటికీ డీడీవో లుగా డీఐఈవో /నోడల్ అధికారులు ఉండడం వలన వేతనాలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కొన్ని సందర్భాలలో బడ్జెట్ ల్యాప్స్ కూడా అవుతుంది అలాంటి వేతనాలు ఇప్పటికి రాని జిల్లాలు ఉన్నాయి మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సిబ్బందికి అన్ని రకాల బిల్లులు చెల్లించడానికి డీడీవో లుగా ప్రిన్సిపాల్ లు మాత్రమే ఉన్నారు. కావున కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ కి ప్రతినెల వేతనాలు చెల్లించడానికి ప్రిన్సిపాల్ లకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం వీరికి వేతనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటూ అందుకు కావాల్సిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు యం. జంగయ్య, రామకృష్ణ గౌడ్, వేముల శేఖర్, డా. కొప్పిశెట్టి సురేష్, గాదె. వెంకన్న, నగేష్, రహీమ్ లు ఒక ప్రకటనలో తెలిపారు.