ఓపెన్ టెన్త్, ఇంటర్ దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ప్రవేశాల గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

2021-22 విద్యా సంవత్సరానికి పదవ తరగతి, ఇంటర్ కోర్సులను దూర విద్య ద్వారా చేరాలనుకొనే విద్యార్థులు అపరాధ రుసుము చెల్లించి ప్రవేశాలు పొందాలని పేర్కొన్నారు.