క్రమబద్దీకరణకు మార్గం సుగమం పై హర్షం -TIPS

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్ విద్యావ్యవస్థను పటిష్ట పరచాలని దృఢ సంకల్పంతో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్దీకరణ చేయడానికి ప్రభుత్వ ఉత్తర్వులు 16 ఇవ్వడం జరిగిందని, అనివార్య కారణాల వలన కార్యాచరణ ముందుకు సాగలేదని.. కాంట్రాక్టు అధ్యాపకుల నిరంతర శ్రమ ఇన్ని రోజుల నిరీక్షణ, కృషి ఫలితం ఈ రోజు గౌరవ హై కోర్టు లో సుదీర్ఘ వాదనల తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణకు అడ్డంకిగా వున్న పిల్ ను కొట్టివేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు TIPS నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు

ప్రస్తుతం గౌరవ హైకోర్ట్ సూచనల ప్రకారం ముఖ్యమంత్రివర్యులు కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతంచేసే మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయడానికి అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో కాంట్రాక్టు లెక్చరర్ లకు “తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి” తమ సంపూర్ణ మద్దతు మరియు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నట్లు కన్వీనర్ లు జంగయ్య, రామకృష్ణ గౌడ్ లు తెలిపారు.