క్రమబద్ధీకరణ తీర్పు హర్షనీయం – TGDCLA

జీవో నంబర్ 16 పై వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల TGDCLA సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ మరియు జనరల్ సెక్రటరీ ఖాదర్వలి హర్షం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పై తమకు పూర్తి నమ్మకం ఉందని ప్రతి ఒక్క కాంట్రాక్టు అధ్యాపకున్ని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈరోజు హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసిన వారిలో డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ ఖాదరవల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మమేష్ కుమార్, డాక్టర్ కిరణ్మయి ఉన్నారు.