హైకోర్టు తీర్పు పట్ల హర్షం – కీర్తి సత్యనారాయణ

జీవో నంబర్ 16 కు వ్యతిరేకంగా వేసిన పిల్ ను కొట్టివేస్తూ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు GJCCLA జనరల్ స్ట్రీమ్ 269 అధ్యక్షుడు కీర్తి సత్యనారాయణ మరియు ప్రధాన కార్యదర్శి వెంపటి రమేష్ బాబు ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ సంధర్భంగా ప్రభుత్వానికి కాంట్రాక్టు అధ్యాపకుల తరపున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 16 ప్రకారము కాంట్రాక్ట్ అధ్యాపకులందరిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి కొత్త కొండ ప్రసాద్, మరియు రాష్ట్ర కార్యవర్గం కూడా హర్షం వ్యక్తం చేశారు.